Share News

models for society యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:04 AM

models for society యువత సమాజానికి ఆదర్శం గా నిలవాలని కాశీబుగ్గ డీఎస్పీ పి.వెంకట అప్పారావు అన్నారు.

models for society  యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి
నువ్వలరేవు గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకట అప్పారావు

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): యువత సమాజానికి ఆదర్శం గా నిలవాలని కాశీబుగ్గ డీఎస్పీ పి.వెంకట అప్పారావు అన్నారు. నువ్వల రేవులో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో శనివారం పాల్గొన్నారు. అనం తరం గ్రామస్థులతో మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణపై సర్పంచ్‌ మువ్వ ల పూర్ణను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీ సులకు సహకారం అందించాలన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకు నేందుకు యువత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా గ్రామస్థులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ నిహార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:04 AM