Share News

బావిలో పడి యువకుడి మృతి

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:05 AM

కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేట గ్రామానికి చెందిన దండుపాటి గౌరినాయుడు (32) ఆదివారం బావిలో పడి మృతి చెందాడు.

బావిలో పడి యువకుడి మృతి

కోటబొమ్మాళి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేట గ్రామానికి చెందిన దండుపాటి గౌరినాయుడు (32) ఆదివారం బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌరినాయుడు మద్యం మత్తులో స్నానానికి బావితో దిగి మునిగిపోయి పోయాడు. దీనిని గమనించిన కొందరు గ్రామస్థులు అతడిని పైకి తెచ్చి 108కి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. గౌరినాయుడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

నరసన్నపేట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కోమర్తి గ్రామానికి చెందిన బిశెట్టి సూర్యనారాయణ (40) విశాఖ కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 25న కోమర్తి వద్ద స్ప్రహతప్ప పడి పోయిన సూర్యనారాయణను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. మొరుగైన వైద్యకోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిం చగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి తల్లి త్రినాథమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ చెప్పారు.

Updated Date - Oct 27 , 2025 | 12:05 AM