ఆటో ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:49 AM
లగేజ్ ఆటో ఢీకొని సవర విజయ్(29) అనే యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మందస మండలంలో చోటుచేసుకుంది.
హరిపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): లగేజ్ ఆటో ఢీకొని సవర విజయ్(29) అనే యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మందస మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంగరపుట్టి గ్రామానికి చెందిన విజయ్ మందస వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా... రాయికోల గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లగేజీ ఆటో ఢీకొంది. గాయపడిన యువకుడ్ని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలిం చి వైద్యం అందించగా.. తలపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.