బాలికను మోసగించిన కేసులో యువకుడి అరెస్టు
ABN , Publish Date - May 06 , 2025 | 12:09 AM
మండలంలోని ఓ గ్రామానికి చెంది న బాలికను మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకు వెళ్లి మోసగించిన కేసులో మండలంలోని గంగరాజ పురానికి చెందిన ప్రపుల్లో ప్రదాన్ (21)ను సోమవారం ఏఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌బాబు తెలిపారు.
మెళియాపుట్టి, మే 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెంది న బాలికను మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకు వెళ్లి మోసగించిన కేసులో మండలంలోని గంగరాజ పురానికి చెందిన ప్రపుల్లో ప్రదాన్ (21)ను సోమవారం ఏఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒక తన కుమార్తె కనిపించడం లేదని గతనెల 22న బాలిక తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా గంగరాజపురానికి చెందిన ప్రపుల్లో ప్రదాన్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లినట్లు తేలిందన్నారు. ఈ మేరకు సోమవారం పోక్సో కేసు నమో దు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుడిని టెక్కలి కోర్టులో హాజరు పరిచి నట్లు ఎస్‌ఐ తెలిపారు.
45 మద్యం సీసాల స్వాధీనం
ఎచ్చెర్ల, మే 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంతలకోడూరు గ్రామా నికి చెందిన ఇప్పిలి కోటేశ్వరరావు తన పాన్‌షాపులో అక్రమంగా నిల్వ ఉం చిన 45 మద్యం సీసాలను సోమవారం ఎచ్చెర్ల పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో బాలికకు గాయాలు
కవిటి, మే 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని సీహెచ్ కపాసుకుద్దిలో విద్యు దాఘాతానికి గురైన బాలిక ఎం.తులసికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ స్థుల కథనం మేరకు..గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పక్కనుంచి సోమ వారం సాయంత్రం తులసి నడుచుకొని వెళ్తోంది. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద నీరు నిల్వ ఉండడంతో అందులో కాలుపడడంతో వెంటనే విద్యుదా ఘాతానికి గురైంది. దీంతో బాలికను కవిటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి బరంపురం తరలించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రణస్థలం, మే 5(ఆంధ్రజ్యోతి): కొండములగాం గ్రామ సమీపంలో రామతీర్థం రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఉపాధిహామీ పనులు చేసు కొని ద్విచక్రవాహనంపై ముగ్గురు వస్తున్నారు. రామతీర్థం రోడ్డు మీదకు వచ్చే క్రమంలో రణస్థలం వైపు వస్తున్న ఆటో ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఎం.మహాలక్ష్మి, వి.మణికంఠ, ఎం.వెంకట రమణ, ఆటో డ్రైవర్ ఎం.రమణకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్. చిరంజీవి కేసు నమోదు చేశారు.
తురకశాసనాం వద్ద తాపీ మేస్త్రీకి..
సోంపేట, మే 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని తురక శాసనాం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబుగాం గ్రామానికి చెంది న తాపీ మేస్ర్తీ గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సోంపేట నుంచి అంబుగాం వెళ్తున్న తాపీమేస్ర్తి తురకశాసనాం జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడిపోయాడు. స్థానిక యువత స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
టెక్కలి, మే 5(ఆంధ్రజ్యోతి): నౌపడా రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ పక్కన 38 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి సోమవారం మృతి చెంది నట్లు సమాచారం వచ్చిందని ఎస్‌ఐ రాము తెలిపారు. వ్యక్తి కుడి చేయిపై సంజయ్ అని పచ్చబొట్టు రాసి ఉందని, ఎవరైనా గుర్తిస్తే 63099 90860 నెంబరుకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.