Share News

అవయవ, శరీర దానానికి యువకుల అంగీకారం

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:00 AM

ఉద్దానం హెల్పింగ్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అఖిలభారత శరీర, అవయవదాన జిల్లా జాయింట్‌ కార్యదర్శి, ఆర్మీ ఉద్యోగి కీలు విజయకుమార్‌తో పాటు శ్రీనివాస్‌ అనే యువకుడు అవయవ, శరీర దానానికి ముందు కువచ్చారు.

అవయవ, శరీర దానానికి యువకుల అంగీకారం
రిమ్స్‌లో అవయవ, శరీర దానం పత్రాలు అందిస్తున్న విజయకుమార్‌, శ్రీనివాస్‌

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్దానం హెల్పింగ్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అఖిలభారత శరీర, అవయవదాన జిల్లా జాయింట్‌ కార్యదర్శి, ఆర్మీ ఉద్యోగి కీలు విజయకుమార్‌తో పాటు శ్రీనివాస్‌ అనే యువకుడు అవయవ, శరీర దానానికి ముందు కువచ్చారు. ఈ మేరకు సంబంధిత అంగీకార పత్రాలను జిల్లా ప్రభు త్వ వైద్య కళాశాల అధికారికి మంగళవారం అందించారు. మృతి చెందిన తరువాత అగ్నికి ఆహుతీ అవ్వడం కన్నా వైద్య విద్యార్థులకు తమ శరీరం ఒక ప్రయోగశాల కావాలనే ఉద్దేశంతో అవయవ, శరీర దానానికి అంగీకరించినట్లు వారు చెప్పారు. ప్రతిఒక్కరూ మూడనమ్మకాలు విడిచి అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Aug 20 , 2025 | 12:00 AM