చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:57 PM
కంబకాయి గ్రామానికి చెందిన కెల్లా రాజారావు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.
నరసన్నపేట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కంబకాయి గ్రామానికి చెందిన కెల్లా రాజారావు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. అత్తవారింట్లో ఉంటున్న రాజారావు బాధ్యత మరచి తిరుగుతుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాం చెందిన రాజారావు ఈనెల 26న గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటంబ సభ్యులు చికిత్స నిమిత్తం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. రాజారావు స్వగ్రామం సరుబుజ్జిలి మండలం చిగురువలస గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.