చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - May 15 , 2025 | 12:04 AM
నగరం లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో యువకుడు చికి త్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్య మే వల్లే తను మరణించాడంటూ అతడి బంధువులు ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యమే అంటూ బంధువుల ఆందోళన
శ్రీకాకుళం క్రైం, మే 14(ఆంధ్రజ్యోతి): నగరం లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో యువకుడు చికి త్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్య మే వల్లే తను మరణించాడంటూ అతడి బంధువులు ఆందోళనకు దిగారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన కొండ్రు త్రినాథరావు(32) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా డు. గత నెల 29వ తేదీ రాత్రి కోటబొమ్మాళి మండలంలో జరిగిన పెళ్లి ఫొటోలను తీసి తన అనుచరుడు తాతారావుతో కలిసి బైక్‌పై వస్తుండ గా.. శ్రీకాకుళం రూరల్ మండలం మునసబు పేట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో గాయపడిన త్రినాథరావును చకిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాతారావు స్వల్పగాయాలతో బయ టపడ్డాడు. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెల 14(మంగళవారం) వరకు త్రినాథరావు కు చికిత్స అందించారు. పరిస్థితి విషమించి త్రినాథరావు మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువు లు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యు ల నిర్లక్ష్యం వల్లే త్రినాథరావు మృతి చెందాడన్నా రు. తమకు న్యాయం జరిగేంతవరకు వెళ్లేదిలేదం టూ నినాదాలు చేశారు. త్రినాథరావుకు సమీప బంధువైన విజయనగరం జిల్లాకు చెందిన ఎక్సైజ్ ఎస్‌ఐ అక్కడికి చేరుకుని వైద్యులతోనూ మాట్లాడారు. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బంది నోరువిప్పలేదు.