Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:22 AM

మఖరాంపురం కూడలి ఆదివారం సంత సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తివరం పంచాయతీ పులకపుట్టుగకి చెందిన పులక సన్నరాజు (28) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

  • కేరళలో వలస కూలీగా..

  • మూడు రోజుల కిందటే గ్రామానికి రాక..

కంచిలి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మఖరాంపురం కూడలి ఆదివారం సంత సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తివరం పంచాయతీ పులకపుట్టుగకి చెందిన పులక సన్నరాజు (28) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సన్న రాజు ద్విచక్ర వాహనంపై కంచిలి వైపు నుంచి రాంగ్‌ రూట్‌లో ఇచ్ఛాపురం వైపు వెళుతుండగా ఎదురుగా ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు కాగా, సన్న రాజుకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కంచిలి ఏఎస్‌ఐ పి.అప్పలరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు వాసులు, రమణమ్మ వ్యవసాయ కూలీలు. మృతుడు కేరళలో వలస కూలీగా పనిచేస్తూ.. మూడు రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో

  • బైక్‌పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు

పొందూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గోరింట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రగాయాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. పెనుబర్తి ఐఆర్‌ కాలనీకి చెందిన మడపాన రాజశేఖర్‌ ద్విచక్ర వాహనంపై గోరింట వైపు వెళు తుండగా పొందూరు నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొంది. దీంతో రాజశేఖర్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో పాటు కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు అంబులెన్సులో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు బీఎస్సీ చదువుతున్న రాజశేఖర్‌.. తల్లిదండ్రులు రోజుకూలీలు. వైద్యచికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలపడం తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ వి.సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:22 AM