Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:03 AM

గిరిజాల పేట సమీపాన రామతీర్థం రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంచాం గ్రామానికి చెందిన పి.వంశీ (21) మృతిచెందగా, మరో వ్యక్తి పవన్‌కు గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రణస్థలం, జూలై 2(ఆంధ్రజ్యోతి): గిరిజాల పేట సమీపాన రామతీర్థం రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంచాం గ్రామానికి చెందిన పి.వంశీ (21) మృతిచెందగా, మరో వ్యక్తి పవన్‌కు గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లిమర్ల నుంచి ద్విచక్ర వాహ నంపై పి.వంశీ, పవన్‌ రణస్థలం వస్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొన డంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వీరిద్దరినీ చికిత్స నిమిత్తం కొండములగాం సీహెచ్‌సీకి తరలించారు. వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 సిబ్బంది శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:03 AM