Share News

బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:44 AM

వేంకటేశ్వర ఆల యలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయ కులు ఆదివారం మధ్యా హ్నం పలాస సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధి తులను పరామర్శించారు.

బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు
మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

పలాస/ రూరల్‌/ కాశీబుగ్గ, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): వేంకటేశ్వర ఆల యలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయ కులు ఆదివారం మధ్యా హ్నం పలాస సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధి తులను పరామర్శించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి నేతలు పరిపాలనలోకి వచ్చిన తరు వాత 16 నెలల్లో ఇటువంటి ఘటన జరగడం మూడోసారి అన్నారు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగాయని, దేనిపై పూర్తి స్థాయి ద ర్యాప్తు చేపట్టకపోవడంపై తప్పు పట్టారు. మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పల రాజు, కె.కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్‌, కొర్ల భారతి, పేరాడ తిలక్‌, పిరియ విజయ ఉన్నారు. ఆలయ భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఉత్తరాంద్ర కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆరోపిం చారు. ఆదివారం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఆలయాన్ని ఆ పార్టీ నేతలతో పరిశీలించారు.

శ్రీకాకుళం రూరల్‌: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే కాశీబుగ్గ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది గాయపడ్డారని ఎమ్మెల్సీ, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను పరామర్శించారు. మాజీ స్వీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజు, విజయనగరం జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 12:44 AM