Share News

శవ రాజకీయాలకు కేరాఫ్‌ వైసీపీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:07 AM

రాష్ట్రం లో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శవ రాజకీ యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ మారిందని పీయూసీ రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

శవ రాజకీయాలకు కేరాఫ్‌ వైసీపీ
అరసవల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఆమదాలవలస, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శవ రాజకీ యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ మారిందని పీయూసీ రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నప్పటికీ దానిని వైసీపీ రాజకీయం చేయడం సిగ్గుచేట న్నారు. కాశీబుగ్గ ఘటన దురదృష్టకరమని, దేవుని దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ది గ్ర్భాంతికి గురిచేసిందన్నారు. సమయం, సందర్భం, విష యం తెలుసుకోకుండా తొక్కిలాటలో భక్తులు చనిపోగానే వైసీపీ శవ రాజకీయం మొదలు పెట్టిందని విమర్శించారు.

దురదృష్టకర ఘటనపై రాజకీయమా?

కవిటి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ వేంక టేశ్వర దేవాలయం వద్ద శనివారం జరిగిన ఘటన దుర దృష్టకరమని, అయితే దీనిపై వైసీపీ నేతలు రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో ఆదివారం విలేకరు లతో మాట్లాడుతూ.. పర్వదినాన భక్తులు అధికంగా రావ డంతో ఊహించని ప్రమాదం జరిగిం దన్నారు. ప్రభు త్వం తక్షణం స్పందించి తగు చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఓ వైపు బాధితులకు సహాయం చేయాలని చూస్తుంటే మాజీ మంత్రి అప్పలరాజు ఫొటో ఫోజు లిస్తూ ప్రభుత్వం పై బురద జల్లేందుకు ఆరాటపడ్డారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎం సీ చైర్మన్‌ మణి చంద్రప్రకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ప్రదాన్‌, డైరెక్టర్‌ బి.చిన్నబాబు, పి.కృష్ణారావు పాల్గొన్నారు.

వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయాలు

అరసవల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ వేంక టేశ్వర ఆలయంలో జరిగిన ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, కాని ఇటువంటి విషయంలో కూడా వైసీపీ నాయకులు శవ రాజకీ యాలకు పాల్పడడం దారుణమని ఎమ్మెల్యే గొండు శంక ర్‌ అన్నారు. ఆదివారం విశాఖ-ఏ కాలనీలోని తన కార్యా లయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇంతటి విచారకర సమయంలో కూడా వైసీపీ నాయకులు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం, సోషల్‌ మీడి యాలో తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టడం సహించరాని విషయమన్నారు. నిజానికి శవ రాజ కీయాలు వైసీపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయ న్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకో వాలని కోరారు. సమావేశంలో నేతలు రెడ్డి గిరిజాశంకర్‌, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: కలిశెట్టి

రణస్థలం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలో జరిగన ఘటన దురదృష్టకరమని, దేవుడు దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు కొల్పోపడం బాధాకరమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబా లకు అన్ని విఽధాలా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుం దన్నారు. ప్రమాదం జరిగిన గుడి ప్రైవేటు నిర్వహణలో నడుస్తోందని వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు శవ రాజకీయం చేయడం దారుణమన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 12:08 AM