కల్తీ మద్యంపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:55 PM
కల్తీ మద్యం జరుగుతోందని నిరూపిస్తే తాము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా సంబంధిత షాపుల యజమానులతో గుండు కొట్టించుకుంటామని, లేకుంటే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆ పని చేయగలరా అని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. కల్తీమద్యంపై మాట్లాడేహక్కు వైసీపీకి లేదని ఎద్దేవాచేశారు.
పలాస, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి):కల్తీ మద్యం జరుగుతోందని నిరూపిస్తే తాము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా సంబంధిత షాపుల యజమానులతో గుండు కొట్టించుకుంటామని, లేకుంటే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆ పని చేయగలరా అని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. కల్తీమద్యంపై మాట్లాడేహక్కు వైసీపీకి లేదని ఎద్దేవాచేశారు.సోమవారం పలాసలో ఏపీట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు,ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పట్టణాధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్పనవీన్, ఎం.నరేంద్ర(చిన్ని), జోగమల్లేశ్వరరావు విలేకరులతో మాట్లా డారు. అప్పలరాజు తెలిసీతెలియని మాటలు ఆడుతున్నారని, కల్తీ అనేది వైసీపీ నుంచి పుట్టుకొచ్చిందని, తెలిపారు.ఐదేళ్లలో నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణా లు హరించారని, వారికి కల్తీపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్తపై నిందలు వేయడం తగదని పేర్కొన్నారు.