టోల్‌ప్లాజా వద్ద వైసీపీ శ్రేణుల హల్‌చల్
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:32 AM
Clashes over removal of flexi మడపాం టోల్‌ప్లాజా వద్ద వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. టోల్‌గేట్లు అన్నీ మూసివేసి రోడ్డుమీద బైఠాయించి శుక్రవారం సాయంత్రం హల్‌చల్ చేశాయి.
తమ నాయకుడి ఫ్లెక్సీలు తొలగించారంటూ సిబ్బందితో ఘర్షణ
గేట్లు ముందు బైఠాయింపు.. నిలిచిపోయిన వాహనాలు
నరసన్నపేట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మడపాం టోల్‌ప్లాజా వద్ద వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. టోల్‌గేట్లు అన్నీ మూసివేసి రోడ్డుమీద బైఠాయించి శుక్రవారం సాయంత్రం హల్‌చల్ చేశాయి. నరసన్నపేట నియోజవర్గ వైసీపీ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య జన్మదినం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు టోల్‌ప్లాజా వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి ఫ్లెక్సీలు లేకపోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందిని ప్రశ్నించారు. టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తామే తొలగించామని సిబ్బంది తెలిపారు. దీంతో వైసీపీ నాయకులు ఆగ్రహంతో సిబ్బందితో ఘర్షణకు దిగారు. టోల్‌ప్లాజా గేట్లు ముందు బైఠాయించి వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వంలో తాము ఫ్లెక్సీలు కట్టకూడదా? అంటూ టోల్‌ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. గేట్లును బంద్ చేయడంతో వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మడపాం టోల్‌ప్లాజా గేట్లు మూసివేయడం పట్ల ప్రశ్నంచిన శ్రావణ్ అనే వ్యక్తిపై కూడా వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. టోల్‌ప్లాజా సిబ్బంది సమాచారం మేరకు నరసన్నపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టోల్‌ప్లాజా గేట్లు తెరిచారు. ఘర్షణ లేకుండా వైసీపీ శ్రేణులను సముదాయించారు. అయితే ఈవ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ శేఖరరావు తెలిపారు.