Yarranna vidyasankalpam : ఎర్రన్న ఆశయాలు.. స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:42 PM
Interview with students of ‘Erranna Vidya Sankalpa’ స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గర ప్రజాసదన్‌లో ‘ఎర్రన్న విద్యాసంకల్పం’ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
అరసవల్లి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గర ప్రజాసదన్‌లో ‘ఎర్రన్న విద్యాసంకల్పం’ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో 130 ఎర్రన్న విద్యాసంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడపై ఆనందం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గొండు శంకర్, తెలలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడితో కలిసి ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ‘2013లో ఉన్నత లక్ష్యంతో ఎర్రన్న విద్యాసంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాం. పేద విద్యార్థులు, నిరుద్యోగులు ఉచితంగా ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నదే లక్ష్యం. పేద విద్యార్థులకు చేయూతనిచ్చేలా డీఎస్సీ, గ్రూప్స్, కానిస్టేబుల్ తదితర పరీక్షలకు అవసరమైన కోచింగ్, మాక్ టెస్టులు, మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్త్తున్నాం. ఎర్రన్న విద్యాసంకల్పంతో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాల’ని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. అధ్యాపక బృందానికి ఆత్మీయ సన్మానం చేశారు.