Share News

సామాజిక స్పృహతో రచనలు చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:02 AM

సామాజిక స్పృహతో వర్థమాన రచయితలు రచనలు చేయాలని పౌరసరఫరాల శాఖ సంచాలకుడు రోణంకి గోవిందరావు అన్నారు.

సామాజిక స్పృహతో రచనలు చేయాలి
పుస్తకావిష్కరణ చేస్తున్న అతిథులు

జరాతీపేట. నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సామాజిక స్పృహతో వర్థమాన రచయితలు రచనలు చేయాలని పౌరసరఫరాల శాఖ సంచాలకుడు రోణంకి గోవిందరావు అన్నారు. స్థానిక మునిసిపల్‌ మైదానంలో జరుగుతున్న సిక్కోలు పుస్తక మహోత్సవంలో బుధవారం రచయిత కూన రంగారావు రచించిన ఆఖరి మెట్టు నవలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పల భానుమూర్తి, కె.భుజంగరావు, బి.గౌరీ శంకర్‌, పి.తిరుపతిరావు, డి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రఘుపాత్రుని శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు, లలిత సంగీతం, సంగీత కళాక్షేత్రం బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Nov 13 , 2025 | 12:02 AM