పాఠశాల బియ్యంలో పురుగులు
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:56 PM
ప్రభుత్వ పాఠశాలలకు జూలై నెలలో పంపిణీ చేసిన సన్నబియ్యంలో సుంకి పురుగులు, సాగే పురుగులు, నూకలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం బసివలస పాఠశాలకు పంపిణీ చేసిన బియ్యంలో సాగే పురుగులు కనిపించాయి.

నరసన్నపేట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలకు జూలై నెలలో పంపిణీ చేసిన సన్నబియ్యంలో సుంకి పురుగులు, సాగే పురుగులు, నూకలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం బసివలస పాఠశాలకు పంపిణీ చేసిన బియ్యంలో సాగే పురుగులు కనిపించాయి. దీంతో హెచ్‌ఎం బాబూరావు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. మరికొన్ని పాఠశాలలకు పంపిణీ చేసిన బియ్యంలోనూ తెల్లని సాగే పురుగులు, సుంకి పురుగులు కనిపిస్తున్నాయని హెచ్‌ఎంలు చెబుతున్నారు. వెంటనే బియ్యాన్ని మార్చాలని... పురుగుల బియ్యంతో విద్యార్థులకు భోజనాలు ఎలా పెడతామని ఎండీఎం నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై హెచ్‌ఎంల నుంచి బియ్యంపైవివరాలను సేకరించి సివిల్ సప్లయిస్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు.