Share News

రూ.4 కోట్లతో గ్రామాల్లో పనులు: ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:35 PM

తోటాడ రెవెన్యూ పరిధి అక్కివరం పంచాయతీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

రూ.4 కోట్లతో గ్రామాల్లో పనులు:  ఎమ్మెల్యే కూన రవికుమార్‌
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తోటాడ రెవెన్యూ పరిధి అక్కివరం పంచాయతీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. అక్కివరం పంచాయతీ పరిధి కొత్తరోడ్డు ప్రాంతాల్లో మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. ఈ పంచాయతీలో మౌలిక సదు పాయాల కల్పనకు రూ.4 కోట్లు మంజూరు చేశామన్నారు. రోడ్లు, కాలు వలు, ఇతర మౌలిక సదుపాయాలకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిత సాధించాలంటే తప్పనిసరిగా ప్రతిఒక్కరు పన్నులు చెల్లించాలన్నారు. కొత్తరోడ్డు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిది ద్దడమే తన ఆశయమన్నారు. కార్యక్రమం లో కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ అధికా రులు, స్థానిక నేతలు తాండ్ర హరి బాబు, బుడుమూరు సీతారాం, హను మంతు బాలకృష్ణ పాల్గొన్నారు.

కాలనీల అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): అరసవల్లి పరిసర కాలనీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుం టామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. మంగళవారం ఆదిత్యనగర్‌ కాలనీ, లక్ష్మీనగర్‌, అసిరితల్లి గుడి ఎదురు రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలు, రోడ్లు, నీటి సమస్య, వీధిలైట్లు, రిజర్వు స్థలాలకు ప్రహరీ నిర్మాణం తదితర అంశా లను పరిశీలించారు. సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:35 PM