Share News

డ్రగ్స్‌ లేని సమాజ నిర్మాణానికి కృషి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:17 AM

డ్రగ్స్‌ లేని సమాజ నిర్మాణానికి అందరూ చేయూత అందించాలని ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు.

డ్రగ్స్‌ లేని సమాజ నిర్మాణానికి కృషి
సైకిల్‌ యాత్రలో పాల్గొన్న నాయకులు, పోలీసు అధికారులు

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ లేని సమాజ నిర్మాణానికి అందరూ చేయూత అందించాలని ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్‌ యాత్ర శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలం పూండి నుంచి ప్రారంభమైంది. స్థానిక ప్రైవేటు కళాశాల ప్రాంగణంలో ఎస్‌ఐ నిహార్‌ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. సైకిల్‌ యాత్ర చేస్తున్న 25 మంది యువకులను ఘనంగా సత్కరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పూండిలో విద్యార్థులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించి.. మానవహారం చేపట్టారు. డోకులపాడు చిన్నారులు ప్రదర్శించిన కోలాటం, తప్పెటగుళ్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, డాక్టర్‌ లీల, నాయకులు కర్ని రమణ, పోతనపల్లి సాంబమూర్తి, గోవింద పాపారావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు శశిభూషణ్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:17 AM