Share News

బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:19 AM

వసతి గృహాల్లోని బాలి కల సంపూర్ణ ఆరోగ్యం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు జిల్లా ప్రసూతి, స్త్రీ వైద్యుల సంఘం ప్రతిని ధులు తెలిపారు.

బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో డా.అనిత

అరసవల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లోని బాలి కల సంపూర్ణ ఆరోగ్యం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు జిల్లా ప్రసూతి, స్త్రీ వైద్యుల సంఘం ప్రతిని ధులు తెలిపారు. ఈ మేర కు శనివారం వారు డీఎంహెచ్‌ వో డా.అనిత, డీసీ హెచ్‌ఎస్‌ డా. కల్యాణ్‌ బాబులను డీఎం హెచ్‌వో కార్యాలయంలో కలిసి వివరించారు. ఈ సందర్భంగా అవగాహన బ్రోచర్లను విడుదల చేశారు. సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖలు, కెజీబీవీ ప్రిన్సిపాళ్ల సహకారంతో వసతి గృహాల్లో ఉండే కిశోర బాలికల సంపూర్ణ ఆరోగ్యం కోసం రక్తహీనత, స్ర్కీనింగ్‌, వ్యక్తిగత, మానసిక పరిశుభ్రత, ప్రవర్తనా మార్పులు, ఆటలు, క్రీడలు, పునరు త్పత్తి ఆరోగ్యం, మంచి, చెడు స్పర్శ, సైబర్‌ క్రైమ్‌ తది తర అంశాలపై అవగాహన కలిగించనున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డా. అరవింద్‌, సభ్యులు రేవతి, ప్రశాంతి, హరిత, డెమో వేంకటేశ్వరరావు, పి.మోహిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:19 AM