మహిళల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 12 , 2025 | 11:57 PM
కార్పొరేషన్ల ద్వారా శిక్షణ ఏర్పాటుచేసి స్వయం ఉపాధి కల్పన తో మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం జిల్లాలో మహిళా కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు.
కార్పొరేషన్ల ద్వారా శిక్షణ ఏర్పాటుచేసి స్వయం ఉపాధి కల్పన తో మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం జిల్లాలో మహిళా కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి: కూన రవికుమార్
ఆమదాలవలస, మే 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళా పక్షపాతిగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన మహిళా కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.వెంకటరావు, కళింగ కార్పొరేషన డైరెక్టర్ తమ్మినేని చం ద్రశేఖర్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, టీడీపీ నాయకులు సంపతిరావు మురళీరావు, అన్నెపు భాస్కరరావు, గొర్లె సూర్యం, నూకరాజు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: గొండు శంకర్
అరసవల్లి, మే12(ఆంధ్రజ్యోతి):మహిళల ఆర్థికస్వావలంబనే లక్ష్యం గా ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.సోమవారం శ్రీకాకుళం గొంటివీధిలో బీసీ పైనాన్స్ కార్పొ రేషన్, ఈడబ్లుఎస్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచితంగా టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ మాదిగ, రెడ్డి గిరిజా శంకర్ పాల్గొన్నారు.
గార మే 12 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాబివృద్ధి కోసం ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గారలో బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ ప్రారంభించారు.