కార్మికులను పర్మినెంట్ చేయాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:35 PM
ఏపీసీఓఎస్‌ని రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ పట్నాయక్ డిమాండ్ చేశారు.

ఇచ్ఛాపురం, ఏప్రిల్15 (ఆంధ్రజ్యోతి): ఏపీసీఓఎస్‌ని రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ పట్నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇచ్ఛాపురం ముని సిపల్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్క రించడంలేదని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు. అనం తరం మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో మంగళ సత్తు, గంగాదర రధో, లక్ష్మణరావు, ఢిల్లీ పాల్గొన్నారు.
ఫఆమదాలవలస, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుడు తాడి సంతోష్ తెలిపారు. స్థానిక ముని సిపల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపా రు.అనంతరం మున్సిపల్ మేనేజర్ లక్ష్మీనారాయణ బిసోయ్‌కు వినతిపత్రం అందిం చారు. కారక్రమంలో మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూని యన్ నాయకులు కె.తారకేశ్వరరావు,శ్రీనివాస్, కె.ఈశ్వరరావు,రాజేష్ పాల్గొన్నారు.