Share News

లారీ ఢీకొని కార్మికుడి దుర్మరణం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:30 PM

రావివలస వద్ద హైవేపై శుక్రవారం అర్ధరా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.

లారీ ఢీకొని కార్మికుడి దుర్మరణం

లావేరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): రావివలస వద్ద హైవేపై శుక్రవారం అర్ధరా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రణస్థలం మండలం కోటపాలెం గ్రామానికి చెందిన కోరాడ నర్సింహులు(34) నడుచు కుంటూ స్వగ్రామం వెళుతుండగా శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న నర్సింహులు శుక్రవారం ఉదయం పనుల కోసం రావివలస వెళ్లి రాత్రి వరకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి రోడ్డు ప్రమాదంలో నర్సింహు లు మృతి చెందినట్టు పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. నర్సింహులకు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నర్సింహులు తండ్రి సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ ఎం.విజయానంద్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:30 PM