విద్యాభివృద్ధికి కృషి చేయండి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:17 PM
డీఎస్సీ ద్వారా నియమితులైన నూతన ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ద్వారా నియమితులైన నూతన ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో నూతన ఉపాధ్యాయు లను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కృషి చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. నియో జకవర్గం నుంచి డీఎస్సీ-2025 ద్వారా 66 మంది ఉపాధ్యా యులుగా నియమితులవడం ఆనందంగా ఉందన్నారు. కూట మి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. కేజీబీవీలకు అదనపు గదులు, సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు మం జూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పేడాడ రామ్మోహన్‌రావు, సూరపునాయుడు, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ శిమ్మ మాధవి, టీడీపీ నాయకులు సనపల ఢిల్లేశ్వరరావు, నూకరాజు, చిగురుపల్లి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.