సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - May 27 , 2025 | 11:56 PM
అధికారులంతా సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు నిచ్చారు. ప్రజల ఆలోచనల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.మంగళవారం జిల్లా అభివృద్ధికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 27(ఆంధ్రజ్యోతి):అధికారులంతా సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు నిచ్చారు. ప్రజల ఆలోచనల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.మంగళవారం జిల్లా అభివృద్ధికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముం దుకుసాగాలని సూచించారు. ప్రధానంగా పింఛన్లు, వ్యవసాయం, మహిళల భద్రత, ఆసుపత్రిసేవలు, రేషన్,విద్యుత్, ఇసుక, మద్యం, నిత్యావసరసరుకుల ధరలు, ఆల యాల్లో సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరా రు.యోగాంధ్ర -2025పై అవగాహన పెంచాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అమలు, గనులశాఖలో నియంత్రణ వ్యవస్థలు, వర్షాకాలానికి ఇసుక నిల్వలు, నీటి పారుదల పనులు, స్వచ్ఛభారత్ కింద పారిశుధ్య నిర్వహణపై చర్చించారు. కాలానుగుణ వ్యాధుల, నీటి పరీక్షల నిర్వహణ, సాగు భూముల గుర్తిం పు, ఆక్రమణల క్రమబద్ధీకరణ, రెవెన్యూ కేసులు, భూసమస్యల పరిష్కారం తదితర సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల పనుల పురోగతి, పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.రోడ్లు, తాగునీరు, అంగన్‌వాడీకేంద్రాలు, హాస్టళ్ల నిర్మా ణంపై సమీక్షించారు.కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐటీడీఏ పీవో శ్రీకాం త్ రెడ్డి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీవో భారతీ సౌజన్య, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.