మహిళల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:42 PM
మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసున్నాయని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పి.వేణుగోపాలం తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో స్వస్త్‌నారీ - స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆరోగ్యసేవలను, రక్తదానంశిబిరం ప్రారంభించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసున్నాయని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పి.వేణుగోపాలం తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో స్వస్త్‌నారీ - స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆరోగ్యసేవలను, రక్తదానంశిబిరం ప్రారంభించారు. కార్య క్రమంలో డీసీహెచ్ కళ్యాణబాబు, ఏరియా ఆసుపత్రి సూపపరింటెండెంట్ శ్రీనివాసబాబు, అడ్వయిజర్ నిక్కు పద్మావతి, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు, మార్కెట్ చైర్‌పర్సన్ పి.ఉమామహేశ్వరి, చింతు పాపారావు, గొద్దు చిట్టిబాబు, ఉణ్న రాజశ్రీ, పుచ్చల కల్పన పాల్గొన్నారు.
యువకులు రక్తదానం చేయాలి
పోలాకి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) యువకులు ముందుకు వచ్చి రక్తదానాన్నిచేసి మరో ప్రాణాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. మం గళవారం మొగిలివిల్లిపేటలో నీలమణిదేవి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు పురస్కరించుకుని రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి సొసైటీ చైర్మన్ బైరి భాస్కరరావు, నాయకులు పప్పల ధర్మారావు, బోర వెంకటరమణ, బట్న రాము పాల్గొన్నారు.