Share News

క్రిస్టియన్‌ వర్షిప్‌ చర్చిలో మహిళా క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:30 PM

నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న క్రిస్టియన్‌ వర్షిప్‌ సెంటర్‌ చర్చిలో మహిళా క్రిస్మస్‌ వేడుకలు శనివారం నిర్వహించారు.

క్రిస్టియన్‌ వర్షిప్‌ చర్చిలో మహిళా క్రిస్మస్‌

అరసవల్లి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న క్రిస్టియన్‌ వర్షిప్‌ సెంటర్‌ చర్చిలో మహిళా క్రిస్మస్‌ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఏసుక్రీస్తును స్తుతిస్తూ కీర్తనలను ఆలపించారు. చిన్నారులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో గోడి శామ్యూల్‌, కె.లతా సుధీర్‌కుమార్‌, విజయ రత్నం, నిషిగోడి తదితరులు పాల్గొన్నారు.

సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ఇచ్ఛాపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈదుపురం ఒరియా చర్చిలో మినీ క్రిస్మస్‌ వేడుకలు శనివారం నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ క్రిస్టియన్‌ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ప్రత్తి అన్వేష్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. క్యాండిల్‌ సర్వీస్‌, బారీ కేక్‌ కట్‌ చేశారు. పాస్టర్‌ బీమ్‌ బెహరా క్రిస్మస్‌ కానుకలు అంద జేశారు. కార్యక్రమంలో పాస్టర్లు ఏలియా, శేఖర్‌, మురళి, ప్రకాష్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:31 PM