Share News

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: శంకర్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:53 PM

మహిళలు పారిశ్రామికవేత్త లుగా ఎదగాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: శంకర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మహిళలు పారిశ్రామికవేత్త లుగా ఎదగాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రా మిక వేత్తల నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన జరగాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమం లో ఐటీ ప్రాజెక్టు ఇన్‌చార్జి జి.అరుణ్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ సూర్యచంద్ర రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ కృష్ణారావు, బోనెల అప్పారావు పాల్గొన్నారు.

ఆపదలో అండగా సీఎంఆర్‌ఎఫ్‌

అరసవల్లి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పేదలకు ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. గురు వారం విశాఖ-ఎ కాలనీ లోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:53 PM