మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:58 PM
ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, దీనికి సముద్రపు నాచు పెంపకాన్ని చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు.
డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్
సోంపేట రూరల్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, దీనికి సముద్రపు నాచు పెంపకాన్ని చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు. సీ ఫుడ్ ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు గాను జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వ ర్యంలో మూలపొలం గ్రామంలో జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. అనంతరం వివిధ శాఖ ల అధికారులతో సమావేశం నిర్వహించారు. సముద్రపు నాచు పెంపకంపై మహిళలకు అవ గాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, సెర్ప్ ఏపీఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.