ఆర్టీసీ సిబ్బంది తీరుపై మహిళల నిరసన
ABN , Publish Date - May 31 , 2025 | 12:15 AM
లొద్దలపేట గ్రామానికి చెందిన మహిళలు, విద్యా ర్థులు ఆర్టీసీ సిబ్బంది తీరుపై శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు.
ఆమదాలవలస, మే 30 (ఆంధ్రజ్యోతి): లొద్దలపేట గ్రామానికి చెందిన మహిళలు, విద్యా ర్థులు ఆర్టీసీ సిబ్బంది తీరుపై శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి తా డివలస గ్రామానికి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లొద్దలపేట గ్రామం మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో శుక్రవారం తాడివలస వెళ్తున్న ఆర్టీసీ బస్సులో లొద్దలపేట గ్రామానికి చెందిన కొంతమంది మహి ళలు, విద్యార్థులు శ్రీకాకుళం ఎక్కారు. అయితే ఈ బస్సు లొద్దల పేట గ్రామానికి వెళ్లకుండా, ఆ గ్రామ జంక్షన్‌లో వారిని బలవంతం గా దించేశారు. దీంతో చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ గ్రామా నికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది ప్రయాణికులతో జంక్షన్‌కు చేరు కున్నారు. తాడివలస వెళ్లిన బస్సు తిరిగి వస్తుండగా.. తమ గ్రామం వద్ద అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సు ముందు బైఠాయించిన నినాదాలు చేశారు. ఇప్పటికైనా సిబ్బంది తీరు మారకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.