మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:16 AM
సంతబొమ్మాళి మండలం బడే నర్సాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి దాలమ్మ మెడలోని రెండు తులాల బంగారం పుస్తెలతా డును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.
కోటబొమ్మాళి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం బడే నర్సాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి దాలమ్మ మెడలోని రెండు తులాల బంగారం పుస్తెలతా డును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. దాలమ్మ ఇంటి సామగ్రి కోసం గురువారం సాయంత్రం కోటబొమ్మాళి బ జారుకు వచ్చింది. తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండ గా.. ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకుని పారిపో యారు. లబోదిబో మంటున్న దాలమ కేకలు అటుగా తన సిబ్బందితో వస్తున్న ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ విని అక్కడి చేరుకుని విషయం తెలుసు కున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.