Share News

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:20 AM

టెక్కలి మెట్టవీధికి చెందిన గౌడు గీత(34) అనే వివాహిత బుధవారం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

చికిత్స పొందుతూ మహిళ మృతి

టెక్కలి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): టెక్కలి మెట్టవీధికి చెందిన గౌడు గీత(34) అనే వివాహిత బుధవారం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈనెల 9న కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెం దింది. మృతురాలికి భర్త సోమేష్‌ ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగువాడకు చెందిన వ్యక్తి..

పాతపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): కాగువాడ గ్రామానికి చెందిన అగూరి కేశవరావు (41) రోడ్డు ప్రమాదంలో గాయపడి రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 9న రాత్రి 9.30 గంటలకు గ్రామంలో నడుస్తుండగా గంగుపేట నుంచి బూరగాం వైపు వెళ్తున్న మోటార్‌ సైకిల్‌ ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే రాగోలు జెమ్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఉషాకుమారి ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:20 AM