Share News

గుండెపోటుతో మహిళ మృతి

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:07 AM

ఆర్టీసీ బస్సులో వస్తుండగా ఓ మహిళ గుండె పోటుకు గురై మృతి చెందిన ఘట న శనివారం జిల్లా కేంద్రం సమీపం లో చోటుచేసుకుంది.

గుండెపోటుతో మహిళ మృతి
బస్సులో ఉన్న తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు కిరణ్‌

ఆర్టీసీ బస్సులోనే ఘటన

గుజరాతీపేట. ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో వస్తుండగా ఓ మహిళ గుండె పోటుకు గురై మృతి చెందిన ఘట న శనివారం జిల్లా కేంద్రం సమీపం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మందస మండలం కుంటికోట గ్రామా నికి చెందిన గుజ్జు తారమ్మ(50) అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం విశాఖ వెళ్లేందుకు తన కుమారుడు కిరణ్‌ కుమార్‌తో కలిసి శనివారం ఉదయం పలాస చేరుకుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో వస్తూ శ్రీకాకుళం సమీపానికి చేరుకునే సరికి గుండెపోటుకు గురైంది. శ్రీకాకుళం బస్‌ కాంప్లెక్స్‌ చేరుకొనేలోగా బస్సులోనే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 27 , 2025 | 12:07 AM