Share News

డాబాపై నుంచి జారిపడి మహిళ మృతి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:58 PM

జగన్నాథపురంలో శనివారం రాత్రి డాబాపై నుంచి పడి కొమర ఎర్రమ్మ(46) మృతి చెందినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు.

డాబాపై నుంచి జారిపడి మహిళ మృతి

సంతబొమ్మాళి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జగన్నాథపురంలో శనివారం రాత్రి డాబాపై నుంచి పడి కొమర ఎర్రమ్మ(46) మృతి చెందినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. పై అంతస్తు నుంచి కింద అంతస్తుకు దిగుతుండగా జారి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఎర్రమ్మ భర్త కొమర రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి..

హరిపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మంద స మండలం కొర్రాయిగేటు వద్ద జాతీయ రహదా రిపై శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మంద స ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. కొర్రాయిగేటు సమీపం ప్రాంతాల్లో బిచ్చమెత్తుకొని జీవనం పొందుతున్న సుమారు 55ఏళ్ల గుర్తుతెలి యని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం హరిపురం ఆసుపత్రికి తరలించగా.. మెరు గైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీలో భద్రపరిచామని, వివారాలు తెలిసినవారు మందస పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

చికిత్స పొందుతూ వృద్ధుడు..

లావేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పాతకుంకాం గ్రామానికి చెందిన శటికం వెంకటరావు(64) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వెంకటరా వు కొన్నాళ్లగా కుటుంబంతో కలిసి విజయవాడలో నివసిస్తున్నాడు. భార్యతో గొ డవపడి నాలుగు రోజుల కిందట స్వగ్రామం పాతకుంకాం వచ్చాడు. ఈ క్రమం లో మనస్తాపానికి గురై ఇంటిలో వ్యవసాయం కోసం తెచ్చి దాచుకున్న గడ్డి మందు శనివారం తాగేశాడు. వాంతులు చేసుకోవడంతో కుంటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యు లకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 11:58 PM