Share News

9.8 కిలోల గంజాయితో మహిళ అరెస్టు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:25 AM

ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా మర్లభ గ్రా మానికి చెందిన కి రణ్‌ ఆనంద అనే మహిళను అరెస్టు చేసి ఆమె నుంచి 9.8 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.

9.8 కిలోల గంజాయితో మహిళ అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సూర్యనారాయణ

పలాస, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా మర్లభ గ్రా మానికి చెందిన కి రణ్‌ ఆనంద అనే మహిళను అరెస్టు చేసి ఆమె నుంచి 9.8 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్‌ఐ నర్సింహమూర్తి, పో లీసుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పలాస రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీ లు నిర్వహిస్తుండగా కిరణ్‌ఆనంద అనే మహిళ గంజాయి బ్యాగ్‌ను పట్టుకొని రై ల్వే స్టేషన్‌కు వెళ్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు. ఆమె గజపతి జిల్లా బద్యానాయక్‌ నుంచి గంజాయి కొనుగోలు చేసుకొని తమిళనాడులో ఉంటున్న బాలాజీ అనే బ్రోకర్‌కు గంజాయి ఇచ్చేందుకు వెళ్తుండగా.. పోలీసులకు పట్టుబడి నట్టు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:25 AM