Share News

11 కిలోల గంజాయితో మహిళ అరెస్టు

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:34 AM

స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగు తున్న ఓ మహిళ నుంచి 11 కిలోల గంజాయిని ఆర్పీఎఫ్‌, రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11 కిలోల గంజాయితో మహిళ అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ కోటేశ్వరరావు

పలాస, అక్టో బరు 28(ఆంధ్ర జ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగు తున్న ఓ మహిళ నుంచి 11 కిలోల గంజాయిని ఆర్పీఎఫ్‌, రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రైల్వే పోలీసు స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు ఇందుకు సంబం ధించిన వివరాలను వెల్లడించారు. ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ మాల్యాద్రి, తన సిబ్బందితో రైల్వేప్లాట్‌ ఫారంపై తనిఖీ చేస్తుండగా ఓ మహిళ ట్రాలీబ్యాగుతో అనుమానస్పదంగా కనిపించింది. ఆమెను ప్రశ్నించడంతో గంజాయి విషయం బయట ప డింది. గజపతి జిల్లా గులుబ గ్రామానికి చెందిన మిక్కి కుమారి మల్లిక్‌ ఒడిశా లో కునుహు అనే వ్యక్తి నుంచి గంజాయి సేకరించింది. విజయవాడ మీదుగా ముంబాయికి తరలించేందుకు రూ.10వేలు ఇస్తామని చెప్పడంతో ఆమె రవాణా చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయింది. దీంతో ఆమె ను విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరచనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 29 , 2025 | 12:34 AM