Share News

పర్యవేక్షణ లేక.. పిచ్చిమొక్కలు పెరిగి

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM

మండలంలోని తర్లాకోట గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల కు పంచాయతీస్థాయి నుంచే సేవలందించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఈ భవనాలను నిర్మించా రు. ఇందులో కేవలం సచివాలయం భవనం మాత్రమే వినియో గిస్తున్నా రు.

పర్యవేక్షణ లేక.. పిచ్చిమొక్కలు పెరిగి
నిరుపయోగంగా ఉన్న విలేజ్‌హెల్త్‌క్లీనిక్‌ భవనం

పలాసరూరల్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని తర్లాకోట గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల కు పంచాయతీస్థాయి నుంచే సేవలందించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఈ భవనాలను నిర్మించా రు. ఇందులో కేవలం సచివాలయం భవనం మాత్రమే వినియో గిస్తున్నా రు. విలేజ్‌హెల్త్‌క్లినిక్‌ను నిరుపయోగంగా విడిచిపెట్టారు.సచివాలయం భవ నానికి కూతవేటు దూరంలోఉన్న విలేజ్‌హెల్త్‌క్లినిక్‌ను ఆయూష్మాన్‌ భారత్‌ విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌గా మార్చిన విషయం విదిమే. నిర్వహణలోపంతోపాటు పర్యవేక్షణ లేకపోవడంతో భవనంచుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు ఆ ప్రాంతమంతా దుర్గంధపూరితంగా మారింది. ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేలా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని వినియోగంలోకి తీసుకురా వాలని కోరుతున్నారు.కాగా ఎన్నికల సమయంలో హడావుడిగా భవనం ప్రారంభించినా బిల్లులు కాకపోవడంతో ఇప్పటికీ కాంట్రాక్టరు తమకు భవ నం అప్పజెప్పలేదని,విద్యుత్‌ పనులు ఇంకా చేయాల్సిఉందని పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Dec 16 , 2025 | 12:06 AM