వృద్ధురాలి మెడపై కత్తిపెట్టి
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:36 AM
అర్ధరాత్రి ఇంటిలో చొరబడి వృద్ధురాలి మెడపై కత్తిపెట్టి చెవులోను, ముక్కుకి ఉన్న బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు.
బంగారు అభరణాల అపహరణ
జలుమూరు (సారవకోట), అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి ఇంటిలో చొరబడి వృద్ధురాలి మెడపై కత్తిపెట్టి చెవులోను, ముక్కుకి ఉన్న బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం బుడితి పెద్దవీధికి చెందిన నిక్కు చెల్లెమ్మ(80) ఇంటిలో నిద్రిస్తుండగా సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఇంటిలో చొరబడి మెడపై కత్తిపెట్టి బెదిరించి ముక్కు, చెవుల్లో ఉన్న అర తులం బంగారం ఆభరణాలు అపహరించుకుపోయాడు. ఈ క్రమం లో ఆమెకు మెడపై కత్తిగాటు పడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. గాయపడిన చెల్లెమ్మను బుడితి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్టు ఆయన తెలిపారు.