పరిశ్రమల హబ్‌గా మారుస్తా: రవికుమార్
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:37 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్ష ల ఉద్యోగాలు కల్పనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యంగా పనిచేసున్నా రని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ అన్నారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్ష ల ఉద్యోగాలు కల్పనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యంగా పనిచేసున్నా రని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నియోజకవర్గంలో యువత పరిశ్రమల స్థాపనకు సహకరిస్తే ఐదేళ్లలో పరిశ్రమల హబ్‌గా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాన న్నారు. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు పొందూరు మండలంలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఫ్యూయల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన పలువురు యువతీ యువకులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈవో అప్పలనాయుడు, స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా మేనేజర్ సాయికుమార్, మునిసి పల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యా సాగర్, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మొదల వలస రమేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.