Share News

రైతులకు సేవలందిస్తా: శివ్వాల

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:36 PM

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనకు జిల్లా రైతులం దరికీ సేవలందించే పదవి లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.

రైతులకు సేవలందిస్తా: శివ్వాల
కొత్తకోట పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శివ్వాల

సరుబుజ్జిలి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనకు జిల్లా రైతులం దరికీ సేవలందించే పదవి లభించడం ఎంతో అదృ ష్టంగా భావిస్తున్నానని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు. శనివారం కొత్తకోట సహ కార సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పా లనలో జిల్లాలో ఎన్నో సహకార సంఘాల పాలక వర్గాలు, అధికారులు కలిసి నిధులు దుర్వినియో గానికి పాల్పడి రైతులను తప్పుదోవ పట్టించార న్నారు. డీసీసీబీ చైర్మన్‌గా కొత్తకోటతో పాటు జిల్లా లోని అన్ని పీఏసీఎస్‌ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సీఈవో బీవీ సన్యాసి రావు, విశ్రాంత ఎంపీడీవో మునగలవలస రవీంద్ర బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు అంబళ్ల రాం బాబు, కొత్తకోట సర్పంచ్‌ సురవరపు జగదీష్‌, టీడీపీ నాయకులు నందివాడ గోవిందరావు, కందుల వెంక టరావు మీసాల రామారావు తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:36 PM