నష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తా
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:25 AM
తుఫాన్ ప్రభావం తో జరిగిన నష్టంపై ప్ర భుత్వానికి నివేదిస్తామ ని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస/ రూరల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావం తో జరిగిన నష్టంపై ప్ర భుత్వానికి నివేదిస్తామ ని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు గురువారం ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆమె పర్యటించి బాధితులతో మాట్లాడారు. పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయని, రోడ్లు వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయా వని, చెట్లు కూడా కూలిపోయాయన్నారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వాని కి సమర్పించి నష్టపరిహారం అందేలా చూస్తానన్నారు. పాడైన రోడ్లు, కల్వర్టను పున: నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు, గురిటి సూర్యనారాయణ, తమ్మినేని గంగారామ్, జోగ మల్లి ఉన్నారు.
హరిపురం: తుఫాన్‌తో నష్టపోయిన వరి, జీడి, మామిడి, కొబ్బరి రైతులను ఆదుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం కుంటికోట, పాతకమలాపురం, చీపి పంచాయతీలోని పలు గిరిజన గ్రామాల్లో ఆమె గురువారం పర్యటించారు. అనంతరం బీఎస్‌పురం గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. వ్యవసాయశాఖ ఏడీ రామారావు, ఏవో నాగరాజు, ఏఈ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బావన దుర్యోధన, పీరుకట్ల విఠల్, తమిరి భాస్కరరావు, రట్టి లింగరాజు, బమ్మిడి కర్రయ్య,దాసరి తాతారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.