భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:11 AM
భర్త అదృశ్యమయ్యాడని పేర్కొంటూ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): భర్త అదృశ్యమయ్యాడని పేర్కొంటూ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నగరంలోని కర్రావీధిలో నివసిస్తున్న వైశ్యరాజు మణికంఠ సిగరెట్లు లైన్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల కిందటే మణికంఠకు లక్ష్మితో వివాహం జరిగింది. అయితే మణికంఠ ఇటీవల తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఆ అప్పు తీర్చేందుకు భార్య మెడలో ఉన్న నక్లెస్‌ను రూ.60 వేలకు తాకట్టు పెడతానని చెప్పి రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఇదే విషయమై భార్యా భర్తల మధ్య మూడు రోజులుగా వివాదం జరిగింది. గురువారం మణికంఠ ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో భార్య లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.