Ambedkar University: ఎందుకు రాలేదో మరి!
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:54 PM
Ambedkar University: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో బుధవారం రూ.36 కోట్లతో నిర్మించిన నూతన పరిపాలనా భవన ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు.
అంబేడ్కర్ వర్సిటీ పరిపాలనా భవనం ప్రారంభం
హాజరుకాని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు
ఎచ్చెర్ల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో బుధవారం రూ.36 కోట్లతో నిర్మించిన నూతన పరిపాలనా భవన ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులను వర్సిటీ అధికారులు ఆహ్వానించినా ఒక్కరు కూడా రాకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే వర్సిటీ అధికారులు కూడా.. ప్రజాప్రతినిధులు లేకుండానే ప్రారంభించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వసతి సమస్య పరిష్కారం: వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని
బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పాలనా పరమైన వసతి సమస్య దాదాపుగా పరిష్కారమైందని వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అన్నారు. రూ.36 కోట్లతో నిర్మించిన పరిపాలనా భవనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రోటోకాల్ విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా అవన్నీ సమసిపోయాయన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, సీహెచ్ రాజశేఖరరావు, ఆర్ అండ్ డీ డీన్ ఎన్.లోకేశ్వరి, ఎస్‌వో డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.