తుఫాన్ రేషన్ పంపిణీలో జాప్యమేల?
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:20 PM
మొంథా తుఫాన్ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ పంపిణీలో జాప్యంపై టెక్కలి మత్స్యశాఖ ఎఫ్‌డీవో ధర్మరా జు పాత్రోను సభ్యులు నిలదీశారు.
-ఎఫ్‌డీవోను నిలదీసిన సభ్యులు
సంతబొమ్మాళి,నవంబరు25 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ పంపిణీలో జాప్యంపై టెక్కలి మత్స్యశాఖ ఎఫ్‌డీవో ధర్మరా జు పాత్రోను సభ్యులు నిలదీశారు. మంగళ వారం ఎంపీపీ మేరుగు రాజేశ్వరి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. జగన్నాథ పురంలో కొంతమంది మత్స్యకారు లకు రేషన్ ఇచ్చి మరికొంతమందికి ఎందుకు పంపిణీ చేయలే దని ఆ పంచాయతీ సర్పంచ్ జోగు రాములమ్మ మ త్స్యశాఖ ఎఫ్‌డీవోను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బంగాళదుంపలు, ఉల్లిపాయలను పంపిణీ చేయకపోవడంతో అవి కుళ్లిపోతు న్నాయని మేఘవరం ఎంపీటీసీ సూరాడ రాజారావు అన్నారు. అందరి మత్స్యకారులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న ఆలోచనతో పంపిణీ చేయలేదని ఎఫ్‌డీవో సమాధానమివ్వగా.. జిల్లాలోని అన్ని మత్స్య కార మండలాల్లో రేషన్ పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రమే ఎందుకు కొర్రీలు వేస్తున్నారని సభ్యులు నిలదీశారు. మండల ప్రజలకు సివిల్ సప్లయిస్ డీటీ అందుబాటులో ఉండడం లేదని ఎంపీపీ రాజేశ్వరి, డీజీపురం సర్పంచ్ అశోకచక్రవర్తి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమిలాడ అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పంపిణీ చేశారని, ఈసారి నుంచి మంచి గుడ్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లను ఎంపీపీ ఆదేశించారు. బోరుభద్రలో విద్యుత్ స్తంభాల మార్పు పనులు పూర్తి చేయాలని సర్పంచ్ బుసకల లక్ష్మీకాంతం కోరా రు. ఈ సమావేశంలో తహసీల్దార్ హేమసుందరరా వు, ఎంపీడీవో జయంత్ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కూచెట్టి కాంతారావు, మండల విద్యాశాఖాధికారి జలు మూరు చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు.