సర్టిఫికెట్లు తీసుకుని తిరిగి వస్తుండగా..
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:02 AM
ఎచ్చెర్ల సమీపం లో పాత జాతీయ రహదా రిపై శుక్రవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమా దంలో వీరఘట్టం మండలం గదబవలసకి చెందిన చిలక ల శేఖర్(25) తీవ్రంగా గా యపడి బ్రెయిన్‌డెడ్‌కు గుర య్యాడు.
రోడ్డు ప్రమాదం
యువకుడికి బ్రెయిన్ డెడ్
ఎచ్చెర్ల, ఆగస్టు 30(ఆం ధ్రజ్యోతి): ఎచ్చెర్ల సమీపం లో పాత జాతీయ రహదా రిపై శుక్రవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమా దంలో వీరఘట్టం మండలం గదబవలసకి చెందిన చిలక ల శేఖర్(25) తీవ్రంగా గా యపడి బ్రెయిన్‌డెడ్‌కు గుర య్యాడు. ఎస్‌ఐ వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బీపీఈడీ పూర్తి చేసిన శేఖర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీలో సర్టిఫికేట్లు తీసుకుని మోటారు బైక్‌పై తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు రావడంతో క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచారు. బీపీఈడీ పూర్తిచేసి గుంటూరులో ఎంపీఈడీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందు కు సిద్ధమైన శేఖర్‌కు ఇలా ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు.