శుభలేఖలు పంచి తిరిగి వస్తుండగా..
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:29 PM
పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. సందడిగా ఉండాల్సిన ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
సరుబుజ్జిలి, ఏప్రిల్ 29(ఆంఽధజ్యోతి): పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. సందడిగా ఉండాల్సిన ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మూల సవలాపురం గ్రామానికి చెందిన గూడాల అప్పారావు (57) తన కుమారుడికి వచ్చే నెల 13న వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో భార్య కుమారితో కలిసి సోమవారం పలు గ్రామాల్లో బంధువులకు పెళ్లికార్డులు పంచాడు. రాత్రికి తిరిగి ఇంటి వస్తుండగా.. అలికాం-బత్తిలి రహదారిలో ఈదురుగాలులతో కూడి వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిగా మారింది. కొత్తకోట కూడలికి వచ్చేసరికి ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అతడిని తప్పిం చే క్రమంలో ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో అప్పారావు తీవ్రంగా గాయపడ్డాడు. భార్య కుమారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని 108 వాహనంలో రాగోలు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసు పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు. కళ్లేదుటే భర్త మృతి చెందడం, మరోవైపు కుమారుడి వివాహం ఆగిపోవడంతో ఆ తల్లితోపాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల పిస్తున్నారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ మెండ జనార్దనరావు తెలిపారు.
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. పట్టణ పరిధి కండ్రవీధికి చెం దిన పూర్ణచంద్ర బెహరా మద్యానికి బానిసై తర చూ భార్య రేవతితో గొడివ పడేవాడు. ఈ క్రమం లో సోమవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం రేవతి భోజనం పెట్టినా తినకుండా ఇంటి మధ్యలో ఉన్న గదిలోకి వెళ్లి గెడపెట్టుకున్నాడు. తలుపు కొట్టినా తీయలేదు. ఇదే సమయంలో గదిలో ఉన్న తాడును మెడు గట్టిగా బిగించుకున్నాడు. మరిది సాయంతో రేవతి తలుపులు తీసి కొన ఊపిరితో ఉన్న పూర్ణచంద్రను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు.