Share News

కారు రిపేరు చేస్తుండగా..

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:33 AM

కోమర్తి జంక్షన్‌ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఓ కారు మొరా యించింది. దీనిని ఓ మెకా నిక్‌ బాగు చేస్తుండగా.. వెను క నుంచి వచ్చిన మరో కారు బలం గా ఢీకొంది.

కారు రిపేరు చేస్తుండగా..
ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా వాహనాలు, మృతిచెందిన వెంకటరావు

  • వెనుక నుంచి వస్తూ బలంగా ఢీకొన్న మరో కారు

  • మెకానిక్‌ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

  • కోమర్తి వద్ద ఘటన

నరసన్నపేట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కోమర్తి జంక్షన్‌ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఓ కారు మొరా యించింది. దీనిని ఓ మెకా నిక్‌ బాగు చేస్తుండగా.. వెను క నుంచి వచ్చిన మరో కారు బలం గా ఢీకొంది. ఈ ఘటనలో ఆ మె కానిక్‌ మృతి చెం దగా.. మరో ము గ్గురు తీవ్రంగా గా యపడ్డారు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం విశాఖ నుంచి టెక్కలి వైపు వెళ్తున్న ఓ కారు కోమర్తి ప్లైఓవర్‌ పైకి వచ్చేసరికి ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కారును రిపేరు చేసేందుకు శ్రీకాకుళం నగర సమీపాన పెద్దపాడుకు చెందిన మెకానిక్‌ కోరాడ వెంకటరావు (25)ను సంప్రదించగా బాగు చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో మొరాయించిన కారులో ఉన్నవారంతా వేరొక వాహనంలో స్వస్తలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వెంకటరావు సాయంత్రం 4 గంటలు సమయంలో తన ద్విచక్రవాహనంపై సహాయకుడు శామ్యూల్‌తో కలిసి కోమర్తి ప్లైఓవర్‌ వద్దకు చేరుకుని మొరాయించిన కారును పరిశీలిస్తున్నాడు. ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి సంతబొమ్మాళి మండలం పాలతలగాం గ్రామానికి వెళ్తున్న మరొక కారు అతివేగంగా వచ్చి మొరాయించి ఉన్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును పరిశీలిస్తున్న మెకానిక్‌ వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందగా.. సహాయకుడు శామ్యూల్‌తోపాటు ఢీకొట్టిన కారులో ఉన్న ఎ.సంతోష్‌, సుశీల తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి కారులో చిక్కుకున్నవారికి బయటకు తీసి గాయపడినవారిని హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా వెంకటరావుకి తండ్రి అప్పలసూరి, తల్లి మహాలక్ష్మి, సోదరి వెంకటలక్ష్మి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 11 , 2025 | 12:33 AM