Share News

పొలంలో నీరు కడుతూ.. కుప్పకూలి..

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:13 AM

మండల కేంద్రం లావేరుకు చెందిన రైతు ఎచ్చెర్ల గొల్ల (50) గురువారం తన పంట పొలంలో వరి నారుకు నీరు కడుతుం డగా హఠాత్తుగా గుండె పోటుకు గురై బట్టిలోనే కుప్పకూలి ప్రాణాలను విడిచా డు.

పొలంలో నీరు కడుతూ.. కుప్పకూలి..

  • గుండెపోటుతో రైతు మృతి

లావేరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లావేరుకు చెందిన రైతు ఎచ్చెర్ల గొల్ల (50) గురువారం తన పంట పొలంలో వరి నారుకు నీరు కడుతుం డగా హఠాత్తుగా గుండె పోటుకు గురై బట్టిలోనే కుప్పకూలి ప్రాణాలను విడిచా డు. లావేరుకు చెందిన ఈ రైతు తన ఖాళీ సమయంలో రణస్థలం జాతీయ రహదారి పక్కన బస్టాప్‌ సమీపంలో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. లావేరులో కౌలుకి తీసుకున్న పంట భూమిలో వరి నారుకు నీరు కడదామని వెళ్లాడని.. గుండె పోటుతో తనువు చాలించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు రామకృష్ణ, కుమార్తె స్వరూప ఉన్నారు.

గోపీనగర్‌ పాఠశాల హెచ్‌ఎం..

ఆమదాలవలస, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గోపీనగర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్‌.స్వప్న గురువారం గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం విధులకు హాజరై న స్వప్న రాత్రి తీవ్ర గుండెనొప్పితో అనారోగ్యానికి గురికాగా.. కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందా రు. స్వప్నకు భర్త నాగరాజుతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:13 AM