Share News

సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌కు వెళ్లి వస్తుండగా..

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:33 AM

వాళ్లంతా దివ్యాంగులు నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో సదరంలో రీవెరిఫికేషన్‌ ఆటోలో వెళ్లారు.

సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌కు వెళ్లి వస్తుండగా..

  • లారీ ఢీకొని దివ్యాంగ మహిళ మృతి.. నలుగురికి గాయాలు

జలుమూరు (సారవకోట), జూలై 10(ఆంధ్రజ్యోతి): వాళ్లంతా దివ్యాంగులు నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో సదరంలో రీవెరిఫికేషన్‌ ఆటోలో వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ధర్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాంబాన అమ్మన్న (65) మృతిచెందగా.. ఆటో నడుపుతున్న దువ్వారి సంతోష్‌కుమార్‌, రాంగాల వరహాలు, దువ్వారి భారతి, దువ్వారి తులసీ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో నరసన్నపేట దాటిగానే అమ్మన్నమ్మ మృతిచెందారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను జలుమూరు ఎస్‌ఐ ఆశోక్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నరసన్నపేట ఆసుపత్రిలో సదరంకు సమయానికి వైద్యులు రాకపోవడంతో.. ఉదయం నిర్వహించాల్సిన పరీక్షలు మిట్టమధ్యాహ్నం నిర్వహించారు. ఇంటికి వెళ్లే ఆదరబదరాలో ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - Jul 11 , 2025 | 12:33 AM