Share News

ఎన్నికల హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారు?

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:36 PM

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో కూటమి ప్రభుత్వం తెలియ జేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారు?
జక్కరపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

టెక్కలి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో కూటమి ప్రభుత్వం తెలియ జేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం మేఘవరం పంచాయతీ జక్కరపేట గిరిజన గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర, జీడి బోర్డు ఏర్పాటు, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ, పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి, శివారు భూములకు సాగునీరందిస్తామని ఇచ్చి న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వీటికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లా లో ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జీసీసీ ద్వారా కొనుగోలు లేక గిరిజనులు దోపిడీకి గురవుతున్నారన్నారు. నేరేడు వద్ద బ్యారేజ్‌ నిర్మించాలని, రిమ్స్‌ ఆసుపత్రి సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని, అక్రమ మైనింగ్‌ రద్దు చేయాలని కోరారు. సమావే శంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మోహనరావు, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, వాసు దేవరావు, లక్ష్మణరావు, సుబ్రహ్మణ్యం, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:36 PM