యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు?
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:12 PM
రాష్ట్రంలో యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రశ్నిం చారు.
అరసవల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రశ్నిం చారు. ఈ మేరకు నగరంలో రామలక్ష్మణ జంక్షన్ నుంచి సూర్యమహల్ కూడలి వరకు శని వారం నిరసన ప్రదర్శన, భిక్షాటన చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిరుద్యోగభృతి మాటే మరిచిపోయార న్నారు. వెంటనే నిరుద్యోగ భృతి రూ.3000 ప్రక టించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చి న హామీని కూడా అమలు చేయలేదని విమ ర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్య దర్శి ఎన్.సాంబశివరాజు, నాయకులు బి.ఆమోస్, అన్నాజీ, వసంత్, జగదీష్, సూర్య, వేణు తదితరులు పాల్గొన్నారు.